ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM KCR: కొత్త పార్టీ పేరుతోనే మునుగోడు బైపోల్‌కు...

ABN, First Publish Date - 2022-10-05T14:50:07+05:30

కొత్త పార్టీ (బీఆర్ఎస్) పేరుతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు బైపోల్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): కొత్త పార్టీ (బీఆర్ఎస్) పేరుతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) మునుగోడు (Munugodu) బైపోల్‌ (By Election)కు వెళ్లనున్నట్లు సమాచారం. బుధవారం జాతీయ పార్టీ ప్రకటనతోపాటు మునుగోడు అభ్యర్థిని ప్రకటించనున్నట్లు తెలియవచ్చింది. మునుగోడులో గెలిచి జాతీయ పార్టీగా.. తొలి విజయాన్ని ఖాతాలో వేసుకోవాలనే యోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నారని, నామినేషన్ వేసే నాటికి కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందని పార్టీ ముఖ్యులకు సీఎం కేసీఆర్ చెప్పినట్లు సమాచారం.


కాగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌).. భారత రాష్ట్రీయ సమితి (బీఆర్‌ఎ్‌స)గా మారేందుకు సర్వం సిద్ధమైంది. పార్టీ పేరు, పరిధిని మార్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ చేసేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు తొలుత రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లతో కూడిన పార్టీ సర్వసభ్య సమావేశం తెలంగాణ భవన్‌లో జరగనుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీని జాతీయ స్థాయికి ఎందుకు తీసుకెళ్లాల్సి వస్తోంది, దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులేంటి అన్నది వివరిస్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలు, ప్రాంతీయ పార్టీల పట్ల ఆ పార్టీ వైఖరిని వివరించనున్నారు. తమ జాతీయ పార్టీ లక్ష్యాలు, అజెండాను వెల్లడించనున్నారు. అనంతరం సర్వసభ్య సమావేశానికి హాజరుకానున్న మొత్తం 283 మంది.. టీఆర్‌ఎస్‌ పార్టీ మార్పునకు సంబంధించిన తీర్మానంపై సంతకాలు చేస్తారు. మధ్యాహ్నం 1.19 గంటలకు కేసీఆర్‌ నోట జాతీయ పార్టీగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన రానుంది. అనంతరం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న వారందరితో కలిసి భోజనం చేశాక.. విలేకరుల సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి. కాగా, పార్టీ పేరు, పరిఽధి తప్ప.. పార్టీ జెండా ఇప్పుడున్నట్లు గులాబీ రంగులోనే ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడున్న జెండానే ఉండనుంది. పార్టీ గుర్తు కూడా కారు గుర్తే ఉంటుంది. 

Updated Date - 2022-10-05T14:50:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising