ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KCR Comments: మహాత్ముడిని కించపరిచే ఘటనలు జరుగుతున్నాయి: కేసీఆర్

ABN, First Publish Date - 2022-08-08T19:31:26+05:30

దేశంలో మహాత్మా గాంధీని అవమానించే పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దేశంలో మహాత్మా గాంధీ (Mahatma gandhi)ని అవమానించే పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) అన్నారు. సోమవారం హెచ్‌ఐసీసీ(HICC)లో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఆపై జాతీయ జెండా(National flag)ను ఆవిష్కరించారు. అనంతరం సీఎం కేసీఆర్ (CM KCR) మాట్లాడుతూ...  గాంధీ (Gandhi)ని కించపరిచే సంఘటనలు ఇవాళ దేశంలో వినాల్సి వస్తుందన్నారు. భారతమాతకు సమానంగా గౌరవం ఇవ్వాల్సిన కొందరు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహాత్ముడు ఎప్పటికైనా మహాత్ముడే అని స్పష్టం చేశారు. స్వాతంత్ర్య పోరాటం గురించి కొత్త తరానికి తెలియదని...  కొత్త తరాలకు స్వాతంత్ర్య పోరాటాలు తెలియాలన్నారు. పలువురి త్యాగాలు, పోరాటాలతో స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. పేదరికం ఉన్నంత కాలం అలజడులు ఉంటాయని చెప్పుకొచ్చారు. ప్రజల ఆకాంక్షలు ఇంకా పూర్తిగా నెరవేరలేదని కేసీఆర్ పేర్కొన్నారు. 



మోదీ, బీజేపీ విధానాలపై కేసీఆర్ చురకలు...

ప్రధాని మోదీ (Modi), బీజేపీ (BJP) విధానాలపై కేసీఆర్ మరోసారి చురకలంటించారు. నెగెటివ్ ఫోర్క్స్‌లను చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు. చెలరేగుతున్న కూర్పును చెడగొట్టడానికి అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జాతిని చీల్చే వారిపట్ల అప్రమత్తమై ఉండాలని తెలిపారు. అవసరమైతే దేశం కోసం ముందుండి పోరాటం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. 

Updated Date - 2022-08-08T19:31:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising