ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేజ్రీవాల్‌తో భేటీ కానున్న కేసీఆర్

ABN, First Publish Date - 2022-03-01T17:47:11+05:30

న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ చేరుకున్నారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో మంగళవారం ఆయన భేటీ కానున్నారు. నూతన ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటుకు సంబంధించిన విషయాలపై ఆయనతో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రాలతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులపై చర్చించనున్నట్లు తెలియవచ్చింది. మూడు రోజుల పర్యటనలో మరికొంతమంది కీలక నేతలను కూడా సీఎం కేసీఆర్ కలవనున్నట్లు తెలుస్తోంది.


ఇటీవల కాలంలో కేంద్రంపై విరుచుకుపడుతున్న కేసీఆర్ బీజేపీ, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిని ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే బలమైన ప్రాంతీయ పార్టీల అధినేతలు, పొరుగు రాష్ట్రాల సీఎంలతో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవర్ తదితరులతో భేటీ అయ్యారు.

Updated Date - 2022-03-01T17:47:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising