ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవి అప్పులు కాదు.. నిధుల సమీకరణ: సీఎం కేసీఆర్

ABN, First Publish Date - 2022-03-15T21:34:03+05:30

ద్రవ్యవినిమయ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బడ్జెట్‌పై విపక్షాలు విమర్శలు చేయడం సహజమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంగళవారం అసెంబ్లీలో ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ అనంత‌రం ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వానికైనా ప్రణాళిక విభాగం అత్యంత కీలకమని అన్నారు. భట్టి విక్రమార్క లేవనెత్తే చాలా అంశాలు పార్లమెంట్ వేదికగా నిలదీస్తే బాగుంటుందని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందంటున్న ప్రతిపక్షాలు.. అవి అప్పులు కాదు నిధుల సమీకరణ అని తెలుసుకోవాలన్నారు. నిధులు ఎలా సమకూర్చుకోవాలో చెప్పేదే బడ్జెట్ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.


ఫీల్డ్‌ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. సెర్చ్‌ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనం ఇస్తామన్నారు. చిన్న ఉద్యోగులకు 30 శాతం పెంపు ఇచ్చామని చెప్పారు. తెలంగాణ  ఏర్పడినప్పుడు రాష్ట్రంలో మూడు మెడికల్‌ కాలేజీలు ఉండేవని, ఇప్పుడు 33 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటుకు ప్రయత్నం చేశామన్నారు. రాష్ట్ర ఆదాయం పెంపుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది మార్పిలోపు 40 వేల మందికి దళితబంధు ఇస్తామని, స్వయం ఉపాథి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.



Updated Date - 2022-03-15T21:34:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising