తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన సీపీఐ చలో రాజ్‌భవన్..
ABN, First Publish Date - 2022-12-07T12:41:19+05:30
ఖైరతాబాద్ చౌరస్తా వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు, సీపీఐ నేతలకు మధ్య తోపులాట జరిగింది.
హైదరాబాద్ : ఖైరతాబాద్ చౌరస్తా వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు, సీపీఐ నేతలకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కింద పడిపోయారు. ఈ క్రమంలోనే పలువురు సీపీఐ కార్యకర్తలకు గాయాలయ్యాయి. రాజ్ భవన్ వైపు వెళ్తున్న కూనంనేనితో పాటు జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, అజీజ్ పాషా ఇతర ముఖ్య నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Updated Date - 2022-12-07T12:41:20+05:30 IST