ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: మంత్రి మల్లారెడ్డిపై మరిన్ని చర్యలకు సిద్ధమవుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు

ABN, First Publish Date - 2022-11-25T11:20:34+05:30

హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy)పై మరిన్ని చర్యలకు కేంద్ర దర్యాప్తు సంస్థలు (Central Investigation Agencies) సిద్ధమవుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy)పై మరిన్ని చర్యలకు కేంద్ర దర్యాప్తు సంస్థలు (Central Investigation Agencies) సిద్ధమవుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి ఆయన సోదరులు, కుమారులు, అల్లుడుకు సంబంధించిన ఇళ్లు, సంస్థల్లో ఐటీ అధికారులు (IT Offi

cials) మూడు రోజులుగా సోదాలు చేసిన విషయం తెలిసిందే. తనిఖీల్లో చాలా సమాచారం సేకరించారు. ఒక ల్యాప్‌టాప్ వ్యవహారంపై అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. అలాగే డ్యూటీలో ఉన్న అధికారులపై మంత్రి సీరియస్ కావడం, విధులకు ఆటంకం కలిగించడం విషయంలో మల్లారెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కాలేజీ ఫీజుల విషయంలో, వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాల్లో మంత్రి ఆర్ధిక అవకతవకలకు పాల్పడినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. మూడు రోజులపాటు చేసిన సోదాల్లో సేకరించిన సమాచారం. సీజ్ చేసిన డబ్బు, డాక్యుమెంట్స్, బ్యాంక్ లాకర్లు వీటన్నింటికి సంబంధించి అధికారులు ఈడీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈడీ కూడా త్వరలో రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల సోదాల్లో భారీగా‌ నగదు సీజ్‌ చేశారు. రూ.18.50 కోట్లు, 15 కిలోల బంగారు ఆభరణాలు సీజ్‌ చేశారు. అలాగే మల్లారెడ్డి ఆస్తులకు సంబంధించిన కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని బ్యాంక్‌ లాకర్లను ఐటీ అధికారులు ఓపెన్ చేయనున్నారు.

Updated Date - 2022-11-25T11:21:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising