ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana News: తెలంగాణపై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఆగ్రహం

ABN, First Publish Date - 2022-07-20T20:33:38+05:30

తెలంగాణ (Telangana)పై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ (Delhi): తెలంగాణ (Telangana)పై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. గరీబ్ కళ్యాణ్ (Garib Kalyan)‌, అన్న యోజన (Anna Yojana) పథకం బియ్యం పంపిణీలో రాష్ట్రం విఫలమైందని, ఏప్రిల్-మే నెలల కోటా 1.90 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని.. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నా లబ్దిదారులకు అందకుండా చేసిందని ఫైర్ (Fire) అయింది. అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లను అదుపు చేయడంలో తెలంగాణ సర్కార్ విఫలమైందని,  స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) అమలు చేయలేదని ఆరోపించింది. అందుకే సెంట్రల్ పూల్‌లోకి బియ్యం సేకరణ నిలిపివేసినట్లు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆ పరిస్థితికి తెలంగాణ ప్రభుత్వమే కారణమని అధికారులు పేర్కొన్నారు. కేంద్ర బృందాల ప్రత్యక్ష తనిఖీలో ఈ వ్యవహారం బయటపడిందన్నారు. 40 మిల్లుల్లో 4,53,896 బియ్యం సంచులు మాయమయ్యాయని, 593 మిల్లుల్లో లెక్కించడానికి వీల్లేకుండా ధాన్యం సంచులు నిల్వచేశారని కేంద్ర అధికారులు పేర్కొన్నారు. ఈ లోపాలు సరిదిద్దుతామన్న రాష్ట్ర ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదని, అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై చర్యలు తీసుకోలేదని అన్నారు. వీటన్నిటిపై ఎఫ్‌సీఐకి తెలంగాణ సర్కార్ రిపోర్ట్ అందజేయాలన్నారు. నివేధిక ఇస్తే సెంట్రల్ పూల్ సేకరణ అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ అధికారులు అన్నారు.

Updated Date - 2022-07-20T20:33:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising