ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీబీఐని ఏమీ చేయలేక మాపై దాడులా?

ABN, First Publish Date - 2022-12-15T03:27:42+05:30

తల్లిపాలు తాగి రొమ్ముకోసే రకం కేసీఆర్‌ అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టి. జగ్గారెడ్డి విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ

కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌పై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

ఏసీపీలు, డీసీపీలు యూనిఫాంలకు విలువ ఇవ్వాలి: జగ్గారెడ్డి

హైదరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): తల్లిపాలు తాగి రొమ్ముకోసే రకం కేసీఆర్‌ అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టి. జగ్గారెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ చట్టంలోని కొన్ని సెక్షన్లను అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. బుధవారం పార్టీ నాయకులు మహే్‌షకుమార్‌ గౌడ్‌, చెరుకు సుధాకర్‌ గౌడ్‌లతో కలిసి జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌పై పోలీసులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

సీబీఐని ఏం చేయలేక తమపై దాడులకు తెగబడతారా? అని ప్రశ్నించారు. తనిఖీల పేరుతో కాంగ్రెస్‌ వార్‌రూంపై రాత్రివేళ దాడి చేసి కంప్యూటర్లు, ల్యాప్‌టా్‌పలను సీజ్‌ చేసి, సిబ్బందిని అరెస్ట్‌ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. తెలంగాణలో లేని సంప్రదాయాన్ని తీసుకురావడం సరికాదని, ఈ విధానం కేసీఆర్‌ పార్టీకి కూడా ఏనాటికైనా ప్రమాదమేనని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తాను పాలు పోసి పెంచిన పాము తననే కాటేస్తుందనే విషయం తెలియదా..? అని ప్రశ్నించారు. అధికారం ఎప్పటికీ తనదేనని అని ఉహించుకోవడం కేసీఆర్‌ మూర్ఖత్వమేనని విమర్శించారు. అధికారంలో ఎవరు ఉంటే పోలీసులు వారి మాట వినాల్సిందేనన్నారు. రేపు రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే పోలీసులు తమ మాటే వినాల్సి వస్తుందని, అప్పుడు మీ పరిస్థితి ఏంటి అని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కొందరు ఏసీపీలు, డీసీపీలు వాళ్ల యూనిఫాంలకు విలువ ఇవ్వాలని ఆయన సూచించారు.

లిక్కర్‌ స్కాం మహారాణి కవిత!

లిక్కర్‌ స్కామ్‌కి మహారాణి ఎమ్మెల్సీ కవిత అని, ఆమె మంచి యాక్టర్‌ అయ్యిందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. పోలీసులు కేసీఆర్‌, కవితలకు ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను తాము తొక్కిపడేస్తే జాడ లేకుండా పోయేవాడన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే దౌర్జన్యంగా వ్యవహరిస్తారా అని మండిపడ్డారు. కాగా, ప్రజల్లో కాంగ్రె్‌సకు బలం ఉందని, అధికారం కోసం అడ్డదారులు తొక్కేది లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. దొడ్డిదారిన అధికారంలోకి రావొద్దని తమ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎప్పుడూ తమకు చెబుతుంటారని తెలిపారు. కాంగ్రెస్‌ వార్‌ రూంపై పోలీసుల దాడి ఘటనపై బుధవారం నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ను కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవితను వ్యక్తిగతంగా కించపరచడం తమ విధానం కాదన్నారు. కవితపై వచ్చిన పోస్టులతో తమకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - 2022-12-15T03:27:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising