ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్యాబ్‌లపై పొరుగు పిడుగు.. ఉపాధి కోల్పోతున్న డ్రైవర్లు

ABN, First Publish Date - 2022-02-23T18:04:57+05:30

ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చే క్యాబ్‌ల వల్ల ఇక్కడి డ్రైవర్లకు నష్టం జరుగుతుందని రాష్ట్ర గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫాం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇతర రాష్ట్రాల నుంచి నగరంలోకి..


హైదరాబాద్‌ సిటీ: ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చే క్యాబ్‌ల వల్ల ఇక్కడి డ్రైవర్లకు నష్టం జరుగుతుందని రాష్ట్ర గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫాం వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు షేక్‌ సలావుద్దీన్‌ అన్నారు. ఇతర రాష్ట్రాల వాహనాలను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన రవాణాశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. నగరంలో ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు 350 కార్లు ఓలా, ఊబర్‌ కంపెనీల్లో నమోదై తిరుగుతున్నాయని, ఇతర రాష్ర్టాల వాహనాలకు అవకాశం ఇవ్వకూడదనే నిబంధనను ఆయా కంపెనీలు తుంగలో తొక్కాయన్నారు. ఈ మేరకు ఓలా, ఊబర్‌ కంపెనీ ప్రతినిధులు, రవాణాశాఖ మంత్రికి, ట్రాఫిక్‌ అధికారులకు ట్వీట్‌ చేస్తూ... నగరంలో తిరుగుతున్న ఇతర రాష్ట్రాల వాహనాల ఫొటోలు, ఆధారాలు జత చేశారు. రెండు రోజుల క్రితం ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రంగనాథ్‌ నిర్వహించిన సమావేశాన్ని సలావుద్దీన్‌ స్వాగతించారు. ఓలా, ఊబర్‌ డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం ఊరటనిచ్చిందని పేర్కొన్నారు. క్యాబ్‌లను నమ్ముకుని బతుకుతున్న డ్రైవర్లకు న్యాయం చేయాలని కోరారు. 

Updated Date - 2022-02-23T18:04:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising