ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాళాలు పగులగొట్టి రెండిళ్లలో చోరీ

ABN, First Publish Date - 2022-12-16T00:52:16+05:30

రెండిళ్ల తాళాలు పగులకొట్టి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబ్దుల్లాపూర్‌మెట్‌, డిసెంబర్‌ 15(ఆంధ్రజ్యోతి): రెండిళ్ల తాళాలు పగులకొట్టి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. ఓ ఇంట్లో నుంచి 17.5 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి, రూ. 8వేల నగదును అపహరించుకుపోయారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన సంఘటనకు సంబంధించి ఇన్‌స్పెక్టర్‌ స్వామి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గండిమైసమ్మ ఆలయం వెనుకాల నిత్యా అపార్ట్‌మెంట్‌ 104 ప్లాట్‌లో ఓరుగంటి వేణుగోపాల్‌ దంపతులు ఉంటున్నారు. ఈనెల 13న ఇంటికి తాళం వేసి కూకట్‌పల్లిలోని కూతురు ఇంటికి వెళ్లారు. అపార్ట్‌మెంట్‌ సమీపంలో ఇండిపెండెంట్‌ హౌస్‌లో ఉంటున్న వెంకటేశ 2 నెలల క్రితం ఇంటికి తాళం వేసి నాగోల్‌లో ఉంటున్నాడు. రెండిళ్లకు తాళాలు వేసి ఉండడం గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి తాళాలు పగులకొట్టి లోపలికి వెళ్లారు. వేణుగోపాల్‌ ఇంట్లోని బీరువాలో బట్టలను చిందరవందరగా పడేసి అందులోని 17.5 గ్రాముల బంగారు, 500 గ్రాముల వెండి వస్తువులతో పాటు రూ. 8వేల నగదును ఎత్తుకెళ్లారు. వెంకటేశ ఇంట్లో మాత్రం ఏమి లభించకపోవడంతో దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. పక్క ప్లాట్‌ వారు వేణుగోపాల్‌కు ఫోన్‌చేసి ఇంట్లో దొంగలు పడ్డారని తెలిపారు. వెంటనే అపార్ట్‌మెంట్‌కు చేరుకున్న ఆయనకు ఇంట్లోని బంగారు, వెండి వస్తువులు కనిపించకపోవడంతో అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న ఇన్‌స్పెక్టర్‌ స్వామి, ఎస్‌ఐ విక్రంరెడ్డి క్లూస్‌ టీంతో వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-12-16T00:52:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising