ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా రాష్ట్రంలో పాలన: బండి సంజయ్

ABN, First Publish Date - 2022-01-26T16:39:23+05:30

రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన జరుగుతోందని బండి సంజయ్ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: 370 ఆర్టికల్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ రద్దు చేశారని, రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ కార్యాలయంలో జాతీయ జెండాను బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విలేకరులు, కవులు, ప్రజా ప్రతినిధులపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఎంపీ అరవింద్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పాలకులు రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. తెలంగాణలో భిన్నమైన పాలన కొనసాగుతోందని బండి సంజయ్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఇంద్రసేనారెడ్డి, పొంగులేటి, నందీశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-26T16:39:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising