ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదు: సంజయ్

ABN, First Publish Date - 2022-04-14T18:02:14+05:30

అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదని బండి సంజయ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గురువారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం తిరిగి రాస్తానన్న వ్యక్తులకు చరమగీతం పాడాలన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నేటికీ పూర్తి చేయలేదని ఆరోపించారు. దళిత సీఎం, దళిత బంధు, డబుల్ బెడ్ రూం ఇళ్లు అని.. దళితులను సీఎం కేసీఆర్ మోసం చేశారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ వివేక్, అధికార ప్రతినిధి సంగప్ప తదితర నాయకులు పాల్గొన్నారు.


మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని, దళితుడిని సీఎం చేస్తానని దళిత డిప్యూటీ సీఎంలను బర్తరఫ్ చేశారని విమర్శించారు. ఒక్కసారి కూడా అంబేద్కర్ జయంతిలో కేసీఆర్ పాల్గొనలేదని అన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని పూర్తిచేయాలని వివేక్ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-04-14T18:02:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising