ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీటెక్‌ విద్యార్థి అదృశ్యం

ABN, First Publish Date - 2022-12-31T00:56:51+05:30

కండ్లకోయలో బీటెక్‌ చదువుతున్న ఓ విద్యార్థి అదృశ్యమయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పేట్‌బషీరాబాద్‌, డిసెంబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): కండ్లకోయలో బీటెక్‌ చదువుతున్న ఓ విద్యార్థి అదృశ్యమయ్యారు. పేట్‌బషీరాబాద్‌ ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం తిరుమల కాలనీకి చెందిన సూర్యనారాయణ కుమారుడు పొన్న గౌతమ్‌ (21) కండ్లకోయలోని సీఎమ్‌ఆర్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతూ కొంపల్లిలోని ఫ్రెండ్స్‌ బాలుర వసతి గృహంలో ఉంటున్నాడు. గౌతమ్‌ హాజరు శాతం తక్కువగా ఉందని తెలిసిన తండ్రి నిజామాబాద్‌ నుంచి ఈనెల 28న మధ్యాహ్నం కొంపల్లి వసతి గృహానికి వచ్చాడు. కుమారుడు కనిపించక పోవడంతో అతని గదిలో ఉంటున్న స్నేహితుడిని ప్రశ్నించగా బయటకు వెళ్లొస్తానని చెప్పి వెళ్లినట్లు తెలిపాడు. రెండు రోజులైనా కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో సూర్యనారాయణ శుక్రవారం పేట్‌బషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-12-31T00:57:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising