ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇతర కార్పొరేషన్లకు ఆదర్శంగా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు

ABN, First Publish Date - 2022-05-27T09:03:54+05:30

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి) : నిజమైన పేదలను ఆదుకోవడమే లక్ష్యంగా పేద బ్రాహ్మణులకోసం ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఏర్పాటు చేసిందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ప్రభుత్వ నిర్ణయాలవల్లే అగ్రవర్ణ పేదలకు సదుపాయాలు

- శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి) : నిజమైన పేదలను ఆదుకోవడమే లక్ష్యంగా పేద బ్రాహ్మణులకోసం ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఏర్పాటు చేసిందని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాల వల్లే అగ్రవర్ణ పేదలకు సదుపాయాలు అందుతున్నాయని ఆయన అన్నారు. బ్రాహ్మణ పరిషత్తు కార్యక్రమాలను తాము కూడా అమలుచేయాలని ఇతర కార్పొరేషన్లు ఆలోచనలు చేస్తున్నాయని సుఖేందర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు అమలు చేస్తున్న ‘వివేకానంద విదేశీ విద్యా పథకం’ లబ్ధిదారులకు ఇక్కడ గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మంజూరు పత్రాలు అందజేశారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఛైర్మన్‌ డా. కేవీ రమణాచారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మండలి చైర్మన్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మొత్తం 133 మంది బ్రాహ్మణ విద్యార్ధుల విదేశీ చదువుకు రూ. 26 కోట్లు ఆర్థిక సాయం అందించడం అభినందనీయమని గుత్తా చెప్పారు. 

Updated Date - 2022-05-27T09:03:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising