ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి అదృశ్యం

ABN, First Publish Date - 2022-06-01T17:32:05+05:30

వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు అదృశ్యమయ్యారు. రహ్మత్‌నగర్‌కు చెందిన జాలిగం నవనీత(18) అమీర్‌పేటలో ఓ దుకాణంలో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/పంజాగుట్ట: వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు అదృశ్యమయ్యారు. రహ్మత్‌నగర్‌కు చెందిన జాలిగం నవనీత(18) అమీర్‌పేటలో ఓ దుకాణంలో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తోంది. మే 29న విధులకు వెళ్లింది. మధ్యాహ్నం రెండు గంటల వరకు వస్తానని తల్లి యాదమ్మకు ఫోన్‌ చేసి చెప్పింది. సాయంత్రం అయినా ఆమె ఇంటికి రాలేదు. ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చింది. తల్లి కూమార్తె పనిచేస్తున్న షాపు వద్దకు వెళ్లి విచారించగా.. మధ్యాహ్నం 12 గంటలకు వెళ్లిపోయిందని నిర్వాహకులు చెప్పారు. నవనీత ఆచూకీ లభించకపోవడంతో యాదమ్మ మంగళవారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది.  


చెన్నై వెళ్తున్నానని చెప్పిన ఓ వృద్ధుడు కనిపించకుండాపోయాడు. పంజాగుట్ట ఎమ్రాల్డ్‌ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న మహ్మద్‌ వాజిద్‌(79) మే 30న చెన్నై వెళ్తున్నానని వాచ్‌మన్‌కు చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చిన తర్వాత వాజిద్‌ కోసం ఆరా తీయగా.. వాచ్‌మన్‌ విషయాన్ని వారికి చెప్పాడు. అతడి ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-06-01T17:32:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising