ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ మెంటల్ బ్యాలన్స్ తప్పారు: నడ్డా

ABN, First Publish Date - 2022-01-05T02:10:24+05:30

హైదరాబాద్: తెలంగాణలో ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వ పాలన కొనసాగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారు. తెలంగాణలో రెండు రోజులుగా జరుగుతున్న ఘటనలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వ పాలన కొనసాగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారు. తెలంగాణలో రెండు రోజులుగా జరుగుతున్న ఘటనలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయన్నారు. తెలంగాణలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా జీవో 317 తెచ్చారని నడ్డా చెప్పారు. జీవోకు వ్యతిరేకంగా శాంతియుతంగా జాగరణ దీక్ష చేస్తున్న బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో నడ్డా విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్‌‌లో ఓడిపోయినప్పటినుంచీ కేసీఆర్ మెంటల్ బ్యాలన్స్ కోల్పోయారన్నారు. తెలంగాణలో వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయని, దేశంలో అత్యంత అవినీతికర రాష్ట్రంగా తెలంగాణను మార్చారని నడ్డా వాపోయారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని నడ్డా స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యోగులకు మద్దతిచ్చేందుకు వచ్చానని, ప్రజల తరపున బీజేపీ నిరంతరం పోరాడుతుందని నడ్డా చెప్పారు. అంతకు ముందు ఆయన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సికింద్రాబాద్ గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.





Updated Date - 2022-01-05T02:10:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising