ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేథావుల పుట్టినిల్లు ఓయూ: సీజేఐ ఎన్వీ రమణ

ABN, First Publish Date - 2022-08-06T03:30:48+05:30

Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీ‌ (Osmania University) 82వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ (CJI NV Ramana), గవర్నర్ తమిళి సై (Governor Tamili

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీ‌ (Osmania University) 82వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ (CJI NV Ramana), గవర్నర్ తమిళి సై (Governor Tamili si) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గవర్నర్, ఓయూ వైస్ చాన్స్‌లర్ రవీందర్ ఎన్వీ రమణకు డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీజేఐ ప్రసంగిస్తూ.. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో మంది మేథావులు విద్యనభ్యసించారని, మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావు, సీఎం కేసీఆర్ ఈ యూనివర్సిటీలో చదువుకున్నవారేనని గుర్తుచేశారు. తాను కూడా ఇదే యూనివర్సిటీలో లా చేయాలనుకున్నా.. తనకు అవకాశం దక్కలేదని చెప్పారు. మీ తల్లిని, మాతృభాషని, మీ ప్రాంతాన్ని ఎక్కడున్నా మరువకూడదని సూచించారు. తెలంగాణ‌పై దాశరథి, కాళోజి రాసిన కవితలను ఎన్వీ రమణ చదివి వినిపించారు.చివరగా తమిళం‌లో గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపారు.


గవర్నర్  మాట్లాడుతూ.. ‘‘విజయానికి షార్ట్ కట్స్ లేవు. కష్టపడాలి. సమస్యల్ని ఎదుర్కోవాల్సిందే . రాత్రిళ్ళు ఏ టైం వరకైనా చదవండి.. కానీ ఉదయం త్వరగా లేవండి. కచ్చితంగా సమయ పాలన పాటించండి. సాధారణంగానే ఉండండి. అసాధారణ పనులు చేయండి. మొదటి సీక్రెట్ హార్డ్ వర్క్. రెండో సీక్రెట్ హార్డ్ వర్క్. మూడో సీక్రెట్ కూడా హార్డ్ వర్కే. సెల్ ఫోన్లను దూరం పెట్టండి. ఇప్పుడున్న స్థితిలో  అమ్మ, నాన్న, చదువు చెప్పే గురువును మర్చిపోయి, ప్రతిదీ గూగుల్‌లో వెతుక్కుంటున్నారు. మీ లక్ష్యాన్ని చేరుకునేలా కష్టపడండి. చిన్నచిన్న లక్ష్యాలు కాకుండా  పెద్ద లక్ష్యం పెట్టుకోండి’’ అని గవర్నర్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-06T03:30:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising