ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెట్టింగ్‌ గ్యాంగ్‌కు బేడీలు

ABN, First Publish Date - 2022-04-10T18:11:10+05:30

క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న మరో ముఠాను వనస్థలిపురం పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెండు రోజుల్లో ఇది రెండో గ్యాంగ్‌ కావడం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ/రాంగోపాల్‌పేట్‌: క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న మరో ముఠాను వనస్థలిపురం పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెండు రోజుల్లో ఇది రెండో గ్యాంగ్‌ కావడం గమనార్హం. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు. ఐపీఎల్‌ నేపథ్యంలో వనస్థలిపురం పోలీసులు బెట్టింగ్‌ గ్యాంగ్‌లపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో.. వనస్థలిపురం ఆటోనగర్‌కు చెందిన దేవినేని చక్రవర్తి అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ‘క్రికెట్‌ మజా’ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నాడని గుర్తించారు. శుక్రవారం రాత్రి పంజాబ్‌ కింగ్స్‌-గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా ఇతడు క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు నిర్ధారించుకుని, ఎస్‌వోటీ పోలీసులతో కలిసి దాడులు చేశారు. చక్రవర్తితోపాటు.. సబ్‌-బుకీ వేములపర్తి హరీశ్‌, పంటర్లు సురేశ్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, షేక్‌ ఆసిఫ్‌ పాషాను అరెస్టు చేశారు. 


 వారి నుంచి కారు, ల్యాప్‌టా్‌పలు, రూ.12.50 లక్షల నగదు, సెల్‌ఫోన్లను సీజ్‌ చేశారు. నిందితులకు సంబంధించిన ఎనిమిది బ్యాంకు ఖాతాల్లోని రూ. 96.78 లక్షలను ఫ్రీజ్‌ చేశారు. ఈ ముఠా ప్రధాన ఆర్గనైజర్‌ ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన అప్పలరాజుగా నిర్ధారించుకున్నారు. అతడు నిడదవోలుకు చెందిన తన బావమరిది శ్రీనివాస్‌ ఉదయ్‌కుమార్‌ ఇంట్లో బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వీరిద్దరూ పరారీలో ఉన్నట్లు సీపీ వెల్లడించారు.


సికింద్రాబాద్‌లో బుకీ అరెస్టు

సికింద్రాబాద్‌ మహంకాళి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఓ క్రికెట్‌ బుకీని అరెస్టు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ కావేటి శ్రీనివాసులు వెల్లడించారు. బాగ్‌ అంబర్‌పేటలోని బతుకమ్మకుంట ఎంఐజీకి చెందిన పవన్‌ జైన్‌.. డి-బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో ఫోన్‌ ద్వారా బెట్టింగ్‌ నిర్వహిస్తుండగా అరెస్టు చేసినట్లు, అతని నుంచి రూ. 20 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.


హయత్‌నగర్‌లో మరో ముఠా..

హయత్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిఽధి పద్మావతి కాలనీలో ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాను భువనగిరి ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు బుకీలు ఆలూరి త్రినాథ్‌, జంగవరపు వెంకట్‌రెడ్డి, సబ్‌ బుకీలు తొట్టపు పర్ధు, మునగాల రమేష్‌, కొల్లి జయవెంకటనాయుడు, బత్తుల శివశంకర్‌లను అదుపులోకి తీసుకున్నారు. మెయిన్‌ బుకీ చిరు పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి రూ. 2.48 లక్షల నగదు, రెండు లైవ్‌ బాక్సెస్‌, 16 మొబైల్స్‌, రెండు కార్లు, నాలుగు ల్యాప్‌టా్‌పలు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2022-04-10T18:11:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising