ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చదువుకునేదెట్లా?

ABN, First Publish Date - 2022-06-21T16:25:02+05:30

జిల్లాలోని సర్కారు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పాఠ్య పుస్తకాల కోసం ఎదురుచూస్తున్నారు. బడులు ప్రారంభమై వారం రోజులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యార్థులకు అందని పాఠ్యపుస్తకాలు

పట్టించుకోని విద్యాశాఖాధికారులు

హైదరాబాద్‌ సిటీ: జిల్లాలోని సర్కారు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పాఠ్య పుస్తకాల కోసం ఎదురుచూస్తున్నారు. బడులు ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా నేటికీ పుస్తకాలు అందకపోవడంతో వారు నిరీక్షి స్తున్నారు. రోజూ పాఠశాలలకు వస్తూ ఖాళీగా కూర్చుని వెళ్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉపాధ్యాయులు పాత తరగతి పాఠాలను చెబుతున్నారు. జిల్లాలోని 16 మండలాల పరిధిలో 691 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. ఇందులో ప్రస్తుతం 1 నుంచి 10 తరగతుల వరకు 1,06,635 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. అయితే ఈనెల 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో అడ్మిషన్లు పెరుగుతున్నాయి. 


పుస్తకాలకు ఎదురుచూపులు..

ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి 10.20 లక్షల పుస్తకాల కోసం  ఇండెంట్‌ పెట్టారు. ఇందులో ఇప్పటివరకు ఒక్కరికి కూడా పుస్తకాలు పంపిణీ చేయలేదు. పుస్తకాలు లేకపోవడంతో కొంతమంది విద్యార్థులు స్కూళ్లకు రావడం లేదని తెలిసింది. మరో వైపు పలువురు ఉపాధ్యాయులు కూడా మధ్యాహ్నమే పిల్లలను ఇంటికి పంపిస్తున్నట్లు సమాచారం. అధికారులు తక్షణమే స్పందించి పాఠశాలలకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - 2022-06-21T16:25:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising