ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫాంహౌ‌స్‌కు వెళ్లి హైదరాబాద్ వచ్చిన డాక్టర్.. ఇంతలోనే పెను విషాదం.. అసలేమైంది..!?

ABN, First Publish Date - 2022-03-20T12:16:33+05:30

బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 12లోని ఓ హోటల్‌ నాలుగో అంతస్తు నుంచి ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 12లోని ఓ హోటల్‌ నాలుగో అంతస్తు నుంచి కిందపడి వైద్యుడు అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన డాక్టర్‌ పంకజ్‌కుమార్‌ జైన్‌ (60) మొదటి కుమార్తె అనుపమ నగరానికి చెందిన బెజవాడ భరత్‌ను ప్రేమించింది. వీరి వివాహం చేసేందుకు పంకజ్‌కుమార్‌ జైన్‌ భార్య ఆశాజైన్‌, కుమార్తె అనుపమ, చిన్న కుమార్తెతో కలిసి రెండు రోజుల క్రితం నగరానికి వచ్చారు. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 12లోని ఓ హోటల్‌లో రెండు గదులు తీసుకున్నారు. 


ఈనెల 18న పెళ్లికొడుకు కుటుంబంతో కలిసి పెద్దషాపూర్‌లోని ఫాంహౌ‌స్‌కు వెళ్లి 19న తిరిగి వచ్చారు. మధ్యాహ్నం అందరూ కలిసి బయటకు వెళ్లారు. తిరిగి వచ్చాక భోజనం కోసం ఆశాజైన్‌ కిందే వేచి ఉండగా, పంకజ్‌కుమార్‌ జైన్‌ నాలుగోఅంతస్తులోని తన గదికి వెళ్లాడు. కుమార్తెలు మూడో అంతస్తులోని గదికి వెళ్లారు. కొద్దిసేపటి తరువాత పెద్ద శబ్దం రావడంతో కిందకు వచ్చి చూడగా పంకజ్‌ పడి ఉన్నాడు. పైనుంచి పడటంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. పంకజ్‌కుమార్‌ ఆరో అంతస్తు నుంచి కింద పడ్డట్టు సీసీ కెమెరాల ద్వారా తెలిసింది. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-03-20T12:16:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising