ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘తెలుగుకు జాతీయ గుర్తింపు తెచ్చింది ఎన్టీఆర్‌’

ABN, First Publish Date - 2022-01-09T11:31:40+05:30

‘తెలుగు జాతికి, తెలుగు భాషకు’ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/భీమవరం : ‘తెలుగు జాతికి, తెలుగు భాషకు’ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు అని హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెద అమిరంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు సంబరాల్లో చివరిరోజు దత్తాత్రేయ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలు భాషాభివృద్ధికి కృషి చేయాలన్నారు.


సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలుగు భాష ఔన్నత్యాన్ని భావితరాలకు తెలిసేలా సభలు నిర్వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ తెలుగు భాషలో జీవన మూలాలు ఉంటాయని, వాటిని కాపాడుకోవడమంటే బతుకు కోరుకోవడమన్నారు. కార్యక్రమానికి గజల్‌ శ్రీనివాస్‌ అధ్యక్షత వహించగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఉండి ఎమ్మెల్యే రామరాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-09T11:31:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising