ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే నెలలో అందుబాటులోకి బహదూర్‌పురా వంతెన

ABN, First Publish Date - 2022-02-19T14:09:22+05:30

వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఆర్‌డీపీ)లో మరో వంతెన అందుబాటులోకి రానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • నెలాఖరుకు ఎల్‌బీనగర్‌ అండర్‌పాస్‌


హైదరాబాద్‌ సిటీ : వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఆర్‌డీపీ)లో మరో వంతెన అందుబాటులోకి రానుంది. రూ.69 కోట్లతో చేపట్టిన బహదురా వంతెనను వచ్చే నెలలో ప్రారంభించనున్నట్టు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో జీహెచ్‌ఎంసీ పేర్కొంది. ఈ ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి వస్తే శంషాబాద్‌ వైపు నుంచి ఆరాంఘర్‌, ఎల్‌బీనగర్‌, యాదాద్రి, ఇతర ప్రాంతాలకు సిగ్నల్‌ చిక్కులు లేని ప్రయాణానికి వీలవుతుంది. ఈ మార్గంలోని ఓవైసీ ఆస్పత్రి వద్ద రెండు నెలల క్రితం అబ్దుల్‌ కలాం వంతెనను మంత్రి కె. తారక రామారావు ప్రారంభించారు. రూ.8 వేల కోట్లతో ఎస్‌ఆర్‌డీపీలో ఇప్పటికే పలు వంతెనలు, అండర్‌ పాస్‌లు, ఆర్‌యూబీలు అందుబాటులోకి వచ్చాయి. ఎల్‌బీనగర్‌ చౌరస్తాలో కుడివైపు అండర్‌పాస్‌ నిర్మాణ పనులు ఈ నెలలో పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2022-02-19T14:09:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising