ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రముఖుల పూజలు

ABN, First Publish Date - 2022-10-07T06:11:38+05:30

దసరా పండుగ సందర్భంగా బుధవారం భాగ్యలక్ష్మి ఆలయంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, అడిషనల్‌ డీజీ శిఖా గోయల్‌, విజయ్‌కుమార్‌ కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చార్మినార్‌ అక్టోబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): దసరా పండుగ సందర్భంగా బుధవారం భాగ్యలక్ష్మి ఆలయంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, అడిషనల్‌ డీజీ శిఖా గోయల్‌, విజయ్‌కుమార్‌ కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే పెద్దసంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. కమిటీ సభ్యులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. చార్మినార్‌ శాంతిభద్రతల విభాగం, ట్రాఫిక్‌ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీనివాస్‌ రెడ్డి బందోబస్తును పర్యవేక్షించారు.

ఘనంగా విజయదశమి వేడుకలు

ఫ భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు  ఫ పలు ప్రాంతాల్లో రావణ దహనం

హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): విజయదశమి వేడుకలను నగరవాసులు ఘనంగా జరుపుకున్నారు. పలు ఆలయాలు బుధవారం భక్తులతో కిక్కిరిసిపోయాయి. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ ఆలయం, బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి ఆలయాలతో పాటు నగరంలో పలు ఆలయాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకొన్న భక్తులు అనంతరం జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో రావణ దహనం కార్యక్రమాలు నిర్వహించారు. 

Updated Date - 2022-10-07T06:11:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising