ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో రెండేళ్లలో 5.76 లక్షల మందికి ఆయుష్మాన్‌ భారత్‌ వైద్య సేవలు: కేంద్రం

ABN, First Publish Date - 2022-12-15T03:40:14+05:30

రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ లబ్ధిదారుల సంఖ్య పెరుగుతోందని కేంద్రం వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ లబ్ధిదారుల సంఖ్య పెరుగుతోందని కేంద్రం వెల్లడించింది. రెండేళ్లలో 5.76 లక్షల మంది ఈ పథకం కింద వైద్య సేవలు పొందారని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈమేరకు పార్లమెంట్‌లో ఆయుష్మాన్‌ లబ్ధిదారులు, ఆయా రాష్ట్రాలకు ఆ స్కీమ్‌ కింద కేటాయించిన నిధుల వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలో 2021 నుంచి ఆయుష్మాన్‌ భారత్‌ పథకం అమలవుతోంది. ఆ ఏడాది రాష్ట్రానికి రూ.150 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. తెలంగాణలో 26 లక్షల మంది ఆయుష్మాన్‌ పథకానికి అర్హులు. ఈ కుటుంబాలకు ఏడాదికి రూ. 5 లక్షల వరకూ ఉచితంగా వైద్య సేవలు పొందే వెసులుబాటు ఉంది. ఇక ఈ స్కీమ్‌ కింద ఇప్పటివరకు అత్యధికంగా తమిళనాడు రాష్ట్రంలో 83.94 లక్షల మంది వైద్య సేవలు పొందినట్లు కేంద్రం తెలిపింది.

Updated Date - 2022-12-15T03:40:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising