ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డబ్బు కోసం యజమాని కిడ్నా్‌పనకు యత్నం

ABN, First Publish Date - 2022-12-31T00:40:24+05:30

డబ్బుల కోసం స్నేహితులతో కలిసి యజమానిని కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నించిన కారు డ్రైవర్‌ కటకటాలపాలయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డ్రైవర్‌, మరో వ్యక్తి అరెస్టు

పరారీలో ఇద్దరు

రాజేంద్రనగర్‌, డిసెంబర్‌ 30(ఆంధ్రజ్యోతి): డబ్బుల కోసం స్నేహితులతో కలిసి యజమానిని కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నించిన కారు డ్రైవర్‌ కటకటాలపాలయ్యాడు. అతనికి సహకరించిన వారిలో ఒకరిని పోలీసులు పట్టుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను శుక్రవారం రాజేంద్రనగర్‌ ఏసీపీ కార్యాలయంలో శంషాబాద్‌ డీసీపీ ఆర్‌.జగదీశ్వర్‌రెడ్డి వెల్లడించారు. గచ్చిబౌలికు చెందిన ద్వారం సాయి కిరణ్‌కుమార్‌రెడ్డి (28)కి బహదూర్‌పురాలో హీరోహోండా షోరూం ఉంది. ఇతని దగ్గర నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం, ఖానాపూర్‌ గ్రామ నివాసి, ప్రస్తుతం గండిపేట్‌ బాయ్స్‌ హాస్టల్‌లో ఉంటున్న పెండ్యాల సుదర్శన్‌ (32) నాలుగు నెలలుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. డబ్బు కోసం ఆశపడ్డ సుదర్శన్‌ యజమానిని కిడ్నాప్‌ చేయాలని పథకం పన్నాడు. ఇందుకోసం వాలెట్‌ పార్కింగ్‌లో స్నేహితులుగా పరిచయమైన బాలాపూర్‌కు చెందిన ఆలేటి అర్జున్‌ (23), గోవాకు చెందిన విజయ్‌, గుంటూరుకు చెందిన అనిల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 20 రోజుల క్రితం వారిని నగరానికి రప్పించాడు. అప్పటినుంచి సాయికిరణ్‌కుమార్‌రెడ్డిని కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ నెల 27న మధ్నాహ్నం సమయంలో సుదర్శన్‌ యజమానిని బహదూర్‌పురా నుంచి గచ్చిబౌలికి కారులో తీసుకువెళుతూ మార్గమధ్యంలో రాజేంద్రనగర్‌, పత్తికుంట వద్దకు రాగానే తనకు మూత్రం వస్తుందని చెప్పి కారు ఆపి దిగాడు. అదే సమయంలో కారులోకి ముగ్గురు వ్యక్తులు ప్రవేశించి సాయికిరణ్‌కుమార్‌రెడ్డిని కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకున్న సాయికిరణ్‌కుమార్‌రెడ్డి రాజేంద్రనగర్‌ పోలీ్‌సస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. డ్రైవర్‌ సుదర్శన్‌, ముగ్గురు వ్యక్తులు కారుతో పాటు అందులోని చెక్‌బుక్‌, సెల్‌ఫోన్‌ తీసుకుని పారిపోయారు. రాజేంద్రనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.నాగేంద్రబాబు, డీఐ పవన్‌, శంషాబాద్‌ ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.వెంకట్‌రెడ్డితో ఏర్పాటైన ప్రత్యేక బృందం శుక్రవారం ఉదయం చౌటుప్పల్‌ వద్ద కారులో వెళుతున్న డ్రైవర్‌ సుదర్శన్‌ (32), అర్జున్‌ (23)ను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి చెక్‌బుక్‌, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. విజయ్‌, అనిల్‌ పరారీలో ఉన్నారు. డ్రైవర్‌ సుదర్శన్‌ పాత నేరస్థుడని డీసీపీ ఆర్‌.జగదీశ్వర్‌ రెడ్డి వెల్లడించారు. అతనిపై రాయదుర్గం, మహంకాళి, గజ్వేల్‌ పోలీసుస్టేషన్లలో కేసులు ఉన్నాయన్నారు. డ్రైవర్లుగా పెట్టుకునే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని, కొత్తవారిని, నేర చరిత్ర ఉన్న వారిని పెట్టుకోవద్దని సూచించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన రాజేంద్రనగర్‌ ఇన్‌స్పెక్టర్‌, డీఐలతో పాటు పోలీసు సిబ్బందికి రివార్డులు అందజేశారు.

Updated Date - 2022-12-31T00:40:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising