పంజాగుట్ట చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలి
ABN, First Publish Date - 2022-12-07T00:20:58+05:30
పంజాగుట్ట చౌరస్తాలో తొలగించిన ప్రదేశంలోనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని వెంటనే పున: ప్రతిష్టించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య డిమాండ్ చేశారు.
పంజాగుట్ట, డిసెంబర్ 6 (ఆంధ్రజ్యోతి): పంజాగుట్ట చౌరస్తాలో తొలగించిన ప్రదేశంలోనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని వెంటనే పున: ప్రతిష్టించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం విగ్రహాన్ని పున:ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ నిరాహారదీక్ష చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతో పాటు పలువురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సంఘాలను కలుపుకొని పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరాహార దీక్షకు మద్దతుగా వివిధ ప్రాంతాల నుంచి మద్దతుదారులు రాగా పోలీసులు వారిని అడ్డుకుని ఎస్‌ఆర్‌నగర్ పీఎస్‌కు తరలించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నె శ్రీధర్‌రావు, నల్గొండ జిల్లా అధ్యక్షుడు మధుబాబు, పంజాగుట్ట విగ్రహ కమిటీ అధ్యక్షుడు భానుప్రకాష్, వర్కింగ్ ప్రెసిడెంట్ వినయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T00:21:03+05:30 IST