ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలియన్స్‌ ఎయిర్‌ విమానంలో సాంకేతిక లోపం.. ప్రయాణికులకు తీవ్ర అవస్థలు

ABN, First Publish Date - 2022-05-17T11:51:04+05:30

సాంకేతిక లోపం పేరుతో అలియన్స్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ ప్రయాణికులకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సహకరించని సంస్థ..


హైదరాబాద్‌ సిటీ : సాంకేతిక లోపం పేరుతో అలియన్స్‌ ఎయిర్‌లైన్స్‌ (Alliance Air Flight) సంస్థ ప్రయాణికులకు చుక్కలు చూపించింది. సరైన సమాచారం అందించకుండా గంటల తరబడి నిరీక్షించేలా చేయడంతో ప్రయాణికులు (Passangers) తీవ్ర అవస్థలు పడ్డారు. ఆలియన్స్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 40 మంది ప్రయాణికులతో సాయంత్రం 6.40 గంటలకు బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలు దేరింది. టేకాఫ్‌ తీసుకోకుండానే రన్‌వేపై చక్కర్లు కొట్టి విమానాన్ని సాంకేతిక లోపం పేరుతో నిలిపి వేశారు. ప్రయాణికులను విమానం నుంచి దించి తిరిగి ఎయిర్‌పోర్ట్‌కు (Airport) పంపారు. 


సరైన సమాచారమివ్వకుండా గంటల తరబడి ఎదురుచూసేలా చేయడంతోపాటు ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. సాంకేతిక సమస్యను పరిష్కరించామని చెబుతూ రాత్రి 10.40 గంటలకు విమానంలోకి ప్రయాణికులను అనుమతించారు. వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రి 11గంటల వరకు విమానాన్ని రన్‌వే పైనే నిలిపి ఉంచారు. ప్రయాణికులకు ఎలాంటి ఆహార సదుపాయాలు కల్పించలేమని సంస్థ ప్రతినిధులు చేతులెత్తేశారు. దాంతో వృద్ధులు, చిన్నపిల్లలు అవస్థలు పడ్డారు. ఈ విమానం ద్వారా హైదరాబాద్‌ వచ్చి కనెక్టెడ్‌ విమానాలు ఎక్కాల్సిన వారు ఇబ్బందులు పడ్డారు.

Updated Date - 2022-05-17T11:51:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising