ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

ABN, First Publish Date - 2022-10-07T06:09:57+05:30

విదేశాల నుంచి ఇద్దరు ప్రయాణికులు వేర్వేరుగా బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తుండగా శంషాబాద్‌ విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌, అక్టోబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): విదేశాల నుంచి ఇద్దరు ప్రయాణికులు వేర్వేరుగా బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తుండగా శంషాబాద్‌ విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు బంగారాన్ని పేస్టు రూపంలోకి మార్చి కవర్‌లో ఉంచి లోదుస్తుల్లో పెట్టుకొన్నాడు. అధికారులు తనిఖీ చేసి అతడి వద్ద 435 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.22.4 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. అదేవిధంగా ఓ ప్రయాణికురాలి వద్ద 865 గ్రాముల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.46.04 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

విదేశీ సిగరెట్లు స్వాధీనం 

పార్సిల్‌ ద్వారా వచ్చిన విదేశీ సిగరెట్లను బుధవారం రాత్రి విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.6.9 లక్షలు ఉంటుందని  అంచనా వేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2022-10-07T06:09:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising