ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నౌహీరా కేసులో రూ.78.63 కోట్ల ఆస్తుల అటాచ్‌

ABN, First Publish Date - 2022-12-15T03:13:48+05:30

నౌహీరా షేక్‌ రూ. 5 వేల కోట్ల మోసం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు రూ. 78.63 కోట్లు విలువచేసే ఆస్తులను బుధవారం అటాచ్‌ చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): నౌహీరా షేక్‌ రూ. 5 వేల కోట్ల మోసం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు రూ. 78.63 కోట్లు విలువచేసే ఆస్తులను బుధవారం అటాచ్‌ చేశారు. తమ సంస్థల్లో పెట్టుబడులు పెడితే ఏడాదికి 36ు అధిక మొత్తం చెల్లిస్తాంటూ నౌహీరా షేక్‌ దేశవ్యాప్తంగా వేల మందికి రూ. 5 వేల కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన విషయం తెలిసిందే. ఆమె ఈ నిధులను షెల్‌ కంపెనీల ద్వారా మళ్లించినట్లు ఈడీ ఇప్పటికే 2018లో గుర్తించి, మనీలాండరింగ్‌ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఎస్‌ఏ బిల్డర్‌ అండ్‌ డెవలపర్స్‌ ద్వారా టోలిచౌకిలో ఆస్తులు కొనుగోలు చేసేందుకు రూ.148 కోట్లు దారిమళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ఈ ఆస్తుల విలువ సుమారు రూ. 70 కోట్లు మాత్రమే ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. మిగతా మొత్తంలో రూ.41 కోట్లను కోల్‌కతా, షిల్లాంగ్‌లోని నీలాంచల్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌తోపాటు మరికొన్ని షెల్‌ కంపెనీలకు దారిమళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఆ నిధులను ఆయా సంస్థల నుంచి సల్లార్‌పురియా సంస్థ రుణాల పేరుతో తిరిగి తీసుకున్నట్లు దర్యాప్తులో ఆధారాలను సేకరించారు. ఆ సంస్థకు చెందిన రూ. 41.05 కోట్ల విలువైన స్థిరాస్తులు, బ్యాంకు బ్యాలెన్స్‌లను అటాచ్‌ చేసినట్లు ఈడీ ఒక ప్రకటనలో వెల్లడించారు.

Updated Date - 2022-12-15T03:13:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising