ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏకాంత ఫోటోలు బయట పెడతానంటూ బెదిరింపులు.. యువతిపై లైంగిక దాడి

ABN, First Publish Date - 2022-06-08T15:31:31+05:30

రాష్ట్రంలో యువతులపై అత్యాచారాలు, లైంగి దాడులు పెరిగిపోతున్నాయి. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసు ఘటన మరువకముందే మరో ఉందతం వెలుగులోకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో యువతులపై అత్యాచారాలు, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసు ఘటన మరువకముందే మరో ఉందతం వెలుగులోకి వచ్చింది. యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నీహాల్ సింగ్ అనే యువకుడు వివాహం చేసుకుంటానని చెప్పి మాయమాటలతో యువతిని నమ్మించి పలుమార్లు లైంగిక వాంఛ నెరవేర్చుకున్నాడు. తనతో లైంగికంగా కలవకపోతే ఏకాంతంగా దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి మరీ పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.


యువతి ఇంట్లో వేరే సంబంధం చూసి నిశ్చితార్థం ఖరారు చేయగా... తనను కాదని వేరే వాళ్లను చేసుకోవద్దని మరోసారి మాయమాటలు చెప్పి నమ్మించి తన కోరిక తీర్చుకున్నాడు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. చివరికి నిహాల్ తన తల్లితో యువతి ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోనని చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన యువతి తల్లి... నిహాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిహాల్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, తన కూతురిని నమ్మించి మోసం చేసి ఇలాంటి దాడికి పాల్పడ్డాడని యువతి తల్లి ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2022-06-08T15:31:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising