హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. బీజేవైఎం కార్యకర్తలపై లాఠీఛార్జ్
ABN, First Publish Date - 2022-02-03T02:18:48+05:30
ఉప్పల్ పోలీస్ స్టేషను వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తోన్న బీజేవైఎం కార్యకర్తలపై ..
హైదరాబాద్: ఉప్పల్ పోలీస్ స్టేషను వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తోన్న బీజేవైఎం కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న బీజేవైఎం కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. దీంతో బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అరెస్ట్ చేసిన తమ పార్టీ కార్యకర్తలను విడుదల చేయాలని ధర్నాకు దిగారు. ఈ ఘటనతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు, బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు.. బీజేవైఎం కార్యకర్తలపై లాఠీలు ఝులిపించారు.
Updated Date - 2022-02-03T02:18:48+05:30 IST