ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana Hrc: ఆడపిల్లలు పుట్టారని భార్య గెంటివేత... సమగ్ర నివేదికకు హెచ్‌ఆర్సీ ఆదేశం

ABN, First Publish Date - 2022-08-04T03:39:22+05:30

ఆడపిల్లలు (Childs) పుట్టారని భార్య (Wife)ను భర్త (Husband) ఇంటి నుంచి గెంటివేసిన ఘటనపై తెలంగాణ హెచ్‌ఆర్సీ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): ఆడపిల్లలు (Childs) పుట్టారని భార్య (Wife)ను భర్త (Husband) ఇంటి నుంచి గెంటివేసిన ఘటనపై తెలంగాణ హెచ్‌ఆర్సీ (Telaganana Human Rights Commission)స్పందించింది. ఆంధ్రజ్యోతి వార్తను (Andhrajyothy news) సుమోటోగా స్వీకరించింది. ఈ నెల 24 లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని మలక్ పేట ఏసీపీని ఆదేశించింది. 


వివరాల్లోకి వెళితే 
ఆడపిల్లలు పుట్టారని..  విడాకులు ఇవ్వాలని, లేకుంటే అదనపు కట్నం, బంగారం తేలవాలంటూ భార్యను ఓ భర్త కొట్టి ఇంటి నుంచి గెంటేసిన ఘటన హైదరాబాద్ సైదాబాద్‌లోని లోకాయుక్త కాలనీలో జరిగింది. సాఫ్ట్‎వేర్ ఇంజినీర్ గోరెంక శ్రీకాంత్‎కు.. మలక్‎పేట సపోటాబాగ్‎కు చెందిన స్వప్నతో 2004లో వివాహం జరిగింది. ఏడాది పాటు వీరి సంసారం అన్నోన్యంగా సాగింది. ఆడపిల్ల పుట్టడంతో గొడవకు దిగి భార్య స్వప్నను ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. దాంతో ఆమె కొన్నేళ్లు పుట్టింటిలో ఉన్నారు. ఏడాదిన్నర క్రితం కుటుంబ పెద్దలు వారికి రాజీకుదిర్చారు. 

అయితే ఆరు నెలల క్రితం స్వప్న కవల పిల్లలకు (ఆడ, మగ) జన్మనిచ్చారు. దాంతో ఆమెకు భర్త నుంచి తిరిగి వేధింపులు మొదలయ్యాయి. విడాకులు తీసుకోవాలని, లేకుంటే అదనపు కట్నంతో పాటు 20 తులాల బంగారం తీసుకురావాలని స్వప్నను శ్రీకాంత్ వేధించాడు. చివరకు ఇంటి నుంచి గెంటివేశారు. దాంతో స్వప్న న్యాయం పోరాటానికి దిగారు. తన బిడ్డలతో కలిసి శ్రీకాంత్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు... బాధితురాలి స్వప్నతో మాట్లాడారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. 

అయితే ఈ వార్తను ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఆంధ్రజ్యోతి వార్తపై తెలంగాణ హెచ్‌ఆర్సీ స్పందించింది. సుమోటోగా స్వీకరించింది. ఘటనపై నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. 


Updated Date - 2022-08-04T03:39:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising