ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కూళ్లను మీరు తెరిపిస్తారా?.. మమ్మల్ని ఓపెన్ చేయమంటారా?: ట్రెస్మా

ABN, First Publish Date - 2022-01-18T18:23:59+05:30

రాష్ట్రంలో కరోనా ఉధృతి కారణంగా సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్(ట్రెస్మా) అభ్యంతరం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా ఉధృతి కారణంగా సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్(ట్రెస్మా) అభ్యంతరం వ్యక్తం చేసింది. మంగళవారం ట్రెస్మా అధ్యక్షుడు వై.శేఖర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్కూళ్లు తెరవాలని డిమాండ్ చేశారు. ‘‘మీరు తెరిపిస్తారా.. మమ్మల్ని ఓపెన్ చేయమంటారా’’ అని అన్నారు. 31 తర్వాత పేరెంట్స్ ఒప్పందంతో బడులు తెరుస్తామని స్పష్టం చేశారు. కరోనా అదుపులోనే ఉంది అని ప్రభుత్వంమే చెబుతోందని... అలాండప్పుడు ఎందుకు స్కూళ్లు బంద్ పెట్టారని ప్రశ్నించారు.


తెలంగాణ కంటే ఎక్కువ కేసులు నమోదు అయ్యే రాష్ట్రాల్లో బడులు నడుస్తున్నాయన్నారు. విద్యార్థులపై సెలవుల ప్రభావం పడుతుందని చెప్పారు. 31 జనవరి నుంచి స్కూళ్లు తెరవకపోతే.. తామే తెరుస్తామని తేల్చిచెప్పారు. తల్లిదండ్రుల నుంచి కూడా బడులు తెరవాలని విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు. పిల్లలకు లెర్నింగ్ లాస్ బాగా పెరిగిపోతుందని అన్నారు. పరీక్షల కాలం మొదలు కాబోతోందని... కనీసం 50 శాతం విద్యార్థులతో నడపమని చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా నిబంధనలను కఠినతరం చేయాలన్నారు. కరోనా పేరు చెప్పి మొత్తం విద్యా వ్యవస్థను బంద్ చేస్తే ఎలా అని శేఖర్ రావు నిలదీశారు. 

Updated Date - 2022-01-18T18:23:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising