ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగర్‌లో విగ్రహాల నిమజ్జనం లేనట్లే..

ABN, First Publish Date - 2022-09-03T16:49:29+05:30

వినాయక ఉత్సవాల మూడో రోజు నుంచి నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. ఇళ్లల్లో, కార్యాలయాల్లో ప్రతిష్ఠించి పూజలు చేసిన వినాయక విగ్రహాలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అందుబాటులో ఉన్నా పని చేయని క్రేన్లు.. 

హైదరాబాద్/ఖైరతాబాద్‌: వినాయక ఉత్సవాల మూడో రోజు నుంచి నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. ఇళ్లల్లో, కార్యాలయాల్లో ప్రతిష్ఠించి పూజలు చేసిన వినాయక విగ్రహాలను చాలా మంది స్థానిక కొలనుల్లోనే నిమజ్జనం చేశారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు పీవోపీతో తయారైన విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనానికి అంగీకరించడం లేదు. ఎన్టీఆర్‌ మార్గంలో 2 క్రేన్లను అందుబాటులో ఉంచినా పని ప్రారంభించ లేదు. అంతేకాదు.. విగ్రహాలు నిమజ్జనం చేయకుండా సాగర్‌ చుట్టూ గేట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. నిమజ్జనానికి వచ్చిన విగ్రహాలను నెక్లె్‌సరోడ్‌ జలవిహార్‌తో పాటు సంజీవయ్య పార్కు సమీపంలోని బేబీ పాండ్స్‌కు పంపుతున్నారు. కాగా, స్థానిక యువకులు డబ్బులు తీసుకుని పలువురు తీసుకొచ్చే చిన్న విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్‌ మార్గం గంగమ్మ దేవాలయం పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. 

Updated Date - 2022-09-03T16:49:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising