ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: వీఆర్‌ఓల బదిలీపై హైకోర్టు స్టే

ABN, First Publish Date - 2022-08-08T21:40:07+05:30

వీఆర్‌ఓల బదిలీపై హైకోర్టు (High Court) స్టే విధించింది. 56 మంది వీఆర్‌ఓ (VRO)ల బదిలీచేస్తూ జీవో 121 ప్రభుత్వం జారీచేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: వీఆర్‌ఓల బదిలీపై హైకోర్టు (High Court) స్టే విధించింది. 56 మంది వీఆర్‌ఓ (VRO)ల బదిలీచేస్తూ జీవో 121 ప్రభుత్వం జారీచేసింది. జీవో 121ను సవాలుచేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం ఈ రోజు విచారణకు స్వీకరించింది. ఇప్పటికి వీఆర్‌ఓలు అందరూ జాయిన్ అయ్యారని పీపీ కోర్టుకు తెలిపారు. 56 మంది మాత్రమే ఇంకా పోస్టింగ్‌లో జాయిన్ కాలేదని ఏజీ న్యాయస్థానానికి తెలిపారు. 56 మందిని రెవిన్యూ శాఖలో కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. రెండేళ్లుగా ఖాళీగా ఉన్న వీఆర్‌ఓలను ఇతర శాఖల్లోకి బదిలీ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5485 మంది వీఆర్‌ఓలు ఉండగా.. అందరినీ ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు గత నెల 23న జీవో-121ను విడుదల చేసినప్పటికీ దాన్ని బహిర్గతపరచలేదు.

Updated Date - 2022-08-08T21:40:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising