ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీజీ వైద్య కాలేజీల్లో ఫీజుల పెంపును కొట్టివేసిన హైకోర్టు

ABN, First Publish Date - 2022-01-19T22:17:47+05:30

రాష్ట్రంలోని పీజీ వైద్య కాలేజీల్లో 2017-2020 సంవత్సరానికి సంబంధించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలోని పీజీ వైద్య కాలేజీల్లో 2017-2020 సంవత్సరానికి సంబంధించిన ఫీజుల పెంపును హైకోర్టు కొట్టివేసింది. ప్రైవేటు వైద్య కాలేజీల్లో 2017-2020కి ఫీజులు పెంచుతూ 2017 మే 9న ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. అయితే టీఏఎఫ్ఆర్‌సీ సిఫార్సు లేకుండా ప్రభుత్వం ఫీజులను పెంచిందంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ అనంతరం పీజీ వైద్య ఫీజుల పెంపుపై సీజే ధర్మాసనం తీర్పు వెల్లడించింది. 2016-19కి టీఏఎఫ్ఆర్‌సీ ఖరారు చేసిన ఫీజులే తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. విద్యార్థుల నుంచి అధిక ఫీజు వసూలు చేస్తే 30 రోజుల్లో తిరిగి ఇచ్చేయాలని కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. కోర్సు పూర్తి చేసిన పీజీ వైద్య విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేయాలని కాలేజీలకు హైకోర్టు ఆదేశాలు ఇస్తూ తీర్పునిచ్చింది. 

Updated Date - 2022-01-19T22:17:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising