ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

ABN, First Publish Date - 2022-03-15T00:46:04+05:30

బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హైకోర్టు కీలక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సభకు గౌరవ అధ్యక్షుడు స్పీకరేనని హైకోర్టు స్పష్టం చేసింది. సస్పెండైన ఎమ్మెల్యేలను వెంటనే స్పీకర్‌ ఎదుట హాజరుపర్చాలని అసెంబ్లీ కార్యదర్శికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు రిప్రజెంట్ చేసుకోవాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు అదేశల ప్రకారం రేపు ఉదయం అసెంబ్లీ ప్రారంభమయ్యే లోపే స్పీకర్ ముందు ఎమ్మెల్యేలే అభ్యర్థన చేసుకోవచ్చు. రేపు ఉదయంలోపు స్పీకర్ ఎదుట సస్పెండైన ఎమ్మెల్యేలు హాజరవ్వాలని హైకోర్టు సూచించింది. సభాపతిగా సమస్యను పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది.


మనది పార్లమెంటరీ డెమోక్రసీ అని హై కోర్టు వ్యాఖ్యానించింది. సభలో ప్రజాప్రతినిధులు ఉంటేనే పార్లమెంట్ డెమోక్రసీ బలపడుతుందని హైకోర్టు పేర్కొంది. ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్టు ఎటువంటి ఆధారాలు లేవని హైకోర్టు అభిప్రాయపడింది. ఆర్టికల్ 14, 19, 21  ప్రకారం సభ్యుల హక్కులకు భంగం వాటిల్లుతుందని పేర్కొంది. ఈ సందర్భంగా పలు కోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు కలగజేసుకోవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. 

Updated Date - 2022-03-15T00:46:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising