ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

High Court: ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై విచారణ

ABN, First Publish Date - 2022-09-07T04:12:07+05:30

ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టు విచారణ జరిగింది. చెన్నమనేని రమేష్ తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తూ కోర్టులను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ (Mla Chennamaneni Ramesh) పౌరసత్వంపై హైకోర్టులో విచారణ జరిగింది. చెన్నమనేని రమేష్ తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తూ కోర్టులను, ప్రజలను మోసం చేస్తున్నారని పిటిషనర్‌ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ ఆది శ్రీనివాస్ తరపున లాయర్‌ రవి కిరణ్‌రావు (Advocate Ravi Kiran Rao) వాదనలు వినిపించారు. చిన్నమనేని పౌరసత్వం రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు.  ఇప్పటికీ చెన్నమనేని జర్మనీ (Germany) పౌరసత్వం కలిగి ఉన్నారని తెలిపారు. చెన్నమనేని జర్మనీలో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌గా చెప్పుకుంటూ ఇండియాలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. భారతీయ పౌరుడు కాకుండానే ఎన్నికల్లో పోటీ చేశారని లాయర్‌ వాదించారు. దీంతో చెన్నమనేనికి అసలు వీసాలు ఉన్నాయా అని హైకోర్టు ప్రశ్నించింది.  తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. 


Updated Date - 2022-09-07T04:12:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising