ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Heavy rains: తెలంగాణకు భారీ వర్షసూచన

ABN, First Publish Date - 2022-08-08T00:56:02+05:30

ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో శనివారం రాత్రి ఏర్పడిన అల్పపీడనం బలపడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో శనివారం రాత్రి ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఆదివారానికి దక్షిణ ఒడిశా, ఉత్తరకోస్తాకు ఆనుకుని వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారి పశ్చిమ వాయువ్యంగా పయనించి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా వెళ్లనున్నది. దీని ప్రభావంతో ఒడిశాలో ఆదివారం భారీ నుంచి అతిభారీ, అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు (Heavy rains), ఉత్తరకోస్తాలో విస్తారంగా, అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయి. సోమవారం తెలంగాణ (Telangana)లో భారీ నుంచి అతిభారీ, అక్కడక్కడా అత్యంత భారీగా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తరకోస్తాలో అనేకచోట్ల, అక్కడక్కడా భారీ వర్షాలు, రాయలసీమ, దక్షిణకోస్తాలో పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఇదే సమయంలో రాయలసీమలో ఈదరుగాలులు వీస్తామని వాతావరణశాఖ తెలిపింది. కాగా అటు తరువాత రెండురోజులు ఉత్తరకోస్తా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, విదర్భ, మరట్వాడా, మధ్య మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.  తీవ్ర అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. రానున్న నాలుగు రోజుల వరకు కోస్తాలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం సూచించింది. 

Updated Date - 2022-08-08T00:56:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising