ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Orange Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం..తెలంగాణకు భారీ వర్షసూచన

ABN, First Publish Date - 2022-09-11T17:49:53+05:30

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు(Heavy rains) శనివారం కూడా కొనసాగాయి. వీటి ప్రభావంతో అనేక చోట్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు(Heavy rains) శనివారం కూడా కొనసాగాయి. వీటి ప్రభావంతో అనేక చోట్ల వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు నానా ఇక్కట్ల పాలయ్యారు. కొన్ని ప్రాంతాల్లో రహదారులపై వరద నీరు ప్రవహిస్తుండగా, చాలా వరకు కోతకు గురయ్యాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.


కామారెడ్డిలో కుండపోత..నిలిచిన రాకపోకలు

గత రెండు, మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు వాగులు, చెరువులు పొంగిపోర్లుతున్నాయి. భారీ వర్షానికి రాజంపేట మండలం లింగాయపల్లిలో మండి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాజంపేట నుంచి కామారెడ్డికి రాకపోకలకు నిలిచిపోయాయి.  


ఆరెంజ్‌ అలర్ట్‌

పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణం కేంద్రం హెచ్చరించింది. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వెల్లడించింది. శుక్రవారం వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం శనివారం తీవ్ర అల్పపీడనంగా మారి అదే ప్రదేశంలో కొనసాగుతున్నట్లు వెల్లడించింది.

ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌, జనగాం, యాదాద్రి, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ ఇచ్చింది. ఈ జిల్లాల్లో ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక, హైదరాబాద్‌లో కొన్ని చోట్ల కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Updated Date - 2022-09-11T17:49:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising