ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Heavy Rain: తెలంగాణకు నేడు, రేపు భారీ వర్ష సూచన

ABN, First Publish Date - 2022-08-04T12:43:38+05:30

నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు (Heavy Rain) కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 8 జిల్లాలకు ఆరెంజ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు (Heavy Rain) కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 8 జిల్లాలకు ఆరెంజ్, 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. నిర్మల్‌, నిజామాబాద్ (Nizamabad), ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. సిరిసిల్ల, ఆదిలాబాద్, (Sirisilla Adilabad)  ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, మహబూబాబాద్‌, వరంగల్, జనగామ, మహబూబ్‌నగర్‌లకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. రాష్ట్రాన్ని వర్షం వదలడం లేదు. వరదలు తగ్గడం లేదు. కొన్నిరోజులు తెరిపినిచ్చినట్లే ఇచ్చిన మాయదారి వాన మరింత తీవ్రతతో విరుచుకుపడుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈనెల మొదటి వారంలో కురిసిన వర్షాలతో పంటలకు కొంత మేర నష్టం జరిగితే,  రెండు రోజుల క్రితం  కురిసిన భారీ కుండపోత వర్షంతో పంటలకు ఊహించని విధంగా  మరింత నష్టం వాటిల్లింది. నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో పరీవాహక ప్రాంతాల్లో సాగు చేసిన పంటలు చాలా వరకు నీట మునిగాయి. రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కూరగాయ, ఆకు కూరల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పసుపు, కొత్తిమీర, పాలకూర, పాయిల్‌ కూర, తోటకూర తదితర ఆకు కూరలు, మిర్చి, కాలీఫ్లవర్‌, టమాట తదితర కూరగాయ పంటలకు నష్టం జరిగింది.

Updated Date - 2022-08-04T12:43:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising