ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ నెల 5 నుంచి తెలంగాణలో హెల్త్ ప్రొఫైల్: హరీష్ రావు

ABN, First Publish Date - 2022-03-03T21:49:32+05:30

తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 5 నుంచి హెల్త్ ప్రొఫైల్‌ను ప్రారంభిస్తున్నామని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌: తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 5 నుంచి హెల్త్ ప్రొఫైల్‌ను ప్రారంభిస్తున్నామని వైద్య,ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు తెలిపారు. నిర్మల్‌లో పట్టణంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడాతూ రాష్ట్రంలో ఆశాలకు వేతనాలు పెంచిన ఘనత  సీఎం కేసీఆర్‌దేనని ఆయన అన్నారు. ఆశాలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చామన్నారు. డెలివరి, గర్భిణీ విషయంలో ఆశవార్కర్లకు  మంచి గౌరవ ఉందన్నారు. నిర్మల్‌లో  ప్రయివేట్ ఆసుపత్రిలో 95శాతం ఆపరేషన్లు జరుగుతున్నాయని, ప్రభుత్వ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీలు చేయాలని ఆయన సూచించారు. అనవసరంగా ఆపరేషన్ చేసి బిడ్డకు, తల్లికి అన్యాయం చేయకండని ఆయన హితవు పలికారు. నార్మల్ డెలివరీ మీద ఆశాలు, ఏఎన్‌ఎంలు అవగాహనా కలిపించాలన్నారు. ఈ మధ్యకాలంలో ఆధునిక జీవన శైలి కారణంగా తెలంగాణలో బీపీ, షుగర్ రోగాలు ఎక్కువ అవుతున్నాయన్నారు. అంగన్‌వాడీ టీచర్లకు దేశంలోనే తెలంగాణలో అత్యధికంగా  జీతం ఉందన్నారు. ప్రధానమంత్రి ఉన్న రాష్ట్రంలో అంగన్‌వాడీలకు 7,800 వేతనం ఇస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణలో మందులకు కొరత లేదన్నారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించారన్నారు. తెలంగాణకు 17మెడికల్ కాలేజీలు వచ్చాయని ఆయన తెలిపారు. 

Updated Date - 2022-03-03T21:49:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising