ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రాంతాలన్నీహరితమయం కావాలి:Shanti kumari

ABN, First Publish Date - 2022-07-06T23:12:33+05:30

రాష్ట్రంలోఉన్నఅన్ని ఖాళీ ప్రాంతాలు హరితమయం అయ్యేలా ఎనిమిదవ విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(shanti kumar) సంబంధిత శాఖలను కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలోఉన్నఅన్ని ఖాళీ ప్రాంతాలు హరితమయం అయ్యేలా ఎనిమిదవ విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(shanti kumar) సంబంధిత శాఖలను కోరారు. ఎనిమిదవ విడత తెలంగాణకు హరితహారం(harita haram) పురోగతిపై రాష్ట్రస్థాయి పరిశీలన- సమన్యయ కమిటీ సమావేశం బుధవారం అరణ్య భవన్ లో జరిగింది. అటవీ, మున్సిపల్, సాగునీటి, పంచాయితీ రాజ్ శాఖలతో పాటు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.గత ఏడు విడతల హరితహారం కార్యక్రమాల అనుభవాలను పరిగణలోకి తీసుకుని ఎలాంటి లోటు పాట్లు లేకుండా ఈయేడాది కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. 


శాఖల వారీగా పెట్టిన మొక్కలు నాటే లక్ష్యాలు, నర్సరీల్లో లభ్యత, అవసరమైన సామాగ్రి (ప్లాంటింగ్ మెటరీయల్), పురోగతిపై సమీక్షా సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఈయేడాది 19.54 కోట్ల మొక్కలు రాష్ట్ర వ్యాప్తంగా నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.(పంచాయితీ రాజ్ – 8.76 కోట్లు, మున్సిపల్ శాఖ- 7.32 కోట్లు (మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కలిపి), సాగునీటి శాఖ-5 కోట్లు, అటవీ శాఖ- 1.54 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్ధేశించారు.)హరితహారం కార్యక్రమాన్ని ఎట్టిపరిస్థితుల్లో రోటీన్ కార్యక్రమంగా తీసుకోవద్దని, ఈ కార్యక్రమం వల్ల పర్యావరణ హితంతో పాటు, ప్రభుత్వానికి, పాల్గొన్న శాఖలకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ సూచించారు. 


రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన నేపథ్యంలో మంచి వర్షాలు కురుస్తున్నాయని,మొక్కలు నాటడాన్ని వేగవంతం చేయాలని తెలిపారు. వీలైనంత వరకు పెద్ద మొక్కలు నాటడం ద్వారా బతికే శాతాన్ని వందశాతం పొందవచ్చని స్పష్టం చేశారు. ప్రాంతాలను, నేలతత్వాన్ని బట్టి మొక్కలు నాటాలని, వీలైనంత వరకు నేటివ్ స్పీసీస్ కు(ప్రాంతీయ మొక్కలకు) ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. కోనో కార్పస్ రకం మొక్కలు నాటడంపై భిన్నాభిప్రాయలు ఉన్నందున వాటిని హరితహారంలో భాగంగా నాటడాన్ని నిలిపివేయాలని గతంలోనే ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. 


రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో మొక్కలు నాటే కార్యాచరణపై సమీక్షించారు.ఇరిగేషన్ శాఖ పరిధిలో సాగునీటి ప్రాజెక్టులు, కాలువల వెంట పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ఈసారి ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు వెల్లడించాడు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీతో పాటు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్ అండ్ హెచ్ఓఓఎఫ్) ఆర్ ఎం డోబ్రియాల్, మున్సిపల్ శాఖ కమిషనర్ డాక్టర్ సత్యనారాయణ, అదనపు పీసీసీఎఫ్ ఏ.కే.సిన్హా, హెచ్ఎండీఏ డైరెక్టర్ (అర్బన్ ఫారెస్ట్రీ) డాక్టర్ ప్రభాకర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


.




Updated Date - 2022-07-06T23:12:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising