ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుటుంబ రాజకీయాల గురించి మోదీ మాట్లాడటం సిగ్గుచేటు: హరీష్‌రావు

ABN, First Publish Date - 2022-05-27T00:58:42+05:30

కుటుంబ రాజకీయాల గురించి ప్రధాని మోదీ మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి హరీష్‌రావు దుయ్యబట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కుటుంబ రాజకీయాల గురించి ప్రధాని మోదీ మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి హరీష్‌రావు దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘మోదీ ప్రసంగం బీజేపీ కార్యకర్తలకు నచ్చుతుంది కావొచ్చు. గురివింద గింజ తన నలుపు చూసుకోవాలి. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ కుమారుడు బీజేపీలో లేడా?. యూపీలో పొత్తు పెట్టుకున్న అప్నాదళ్‌ కుటుంబ పార్టీ కాదా?.. మీ తప్పులు ఎత్తి చూపితే కుటుంబ పార్టీ అంటారు. గతంలో పంజాబ్‌లో అకాళీదళ్‌తో అధికారం పంచుకోలేదా?.. మోదీ ఒక వేలు ఎత్తి చూపితే.. నాలుగు వేళ్లు మీవైపే చూపిస్తాయి. కేసీఆర్‌ది కుటుంబ పార్టీ కాదు.. తెలంగాణే ఓ కుటుంబం. రాష్ట్రాన్ని కుటుంబంగా భావిస్తే పరిపాలించే నాయకుడు కేసీఆర్‌. అధికారం లాక్కుంటే రాలేదు. ప్రజలే అధికారం ఇచ్చారు’’ అని హరీష్‌రావు తెలిపారు.

Updated Date - 2022-05-27T00:58:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising