ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: కేయూలో 22వ స్నాతకోత్సవం.. హాజరైన గవర్నర్ తమిళిసై

ABN, First Publish Date - 2022-08-25T17:40:37+05:30

కాకతీయ యూనివర్సిటీలో 22వ స్నాతకోత్సవం ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమకొండ (Hanumakonda): కాకతీయ యూనివర్సిటీలో 22వ స్నాతకోత్సవం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళి సై (Governor Tamilisai), సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బోర్డు సెక్రటరీ సందీప్ వర్మ, వీసీ రమేష్, పలువురు ఉన్నతాధికారులు, పట్టభద్రులు హాజరయ్యారు. ఛాన్సలర్ హోదాలో పాల్గొన్న గవర్నర్ 56 మందికి పీహెచ్‎డీ (PHD) పట్టాలు, బంగారు పతకాలను అందజేశారు. గవర్నర్ పర్యటన దృష్ట్యా జిల్లాలో పోలీసులు ముందస్తుగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.


ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ విద్యార్థులు క్రియేటివ్‌గా ఆలోచించాలన్నారు. ఎదగాలంటే సవాళ్ళను ఎదుర్కొంటు ముందుకు సాగాలని సూచించారు. ఆన్ రైడ్‌ను పక్కకు పెట్టి.. ప్రకృతిని ఆస్వాదించాలని, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలన్నారు. లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ... వ్యక్తిత్వ వికాసం సాధించాలని చెప్పారు. మహిళలు సాధారణ కోర్సులు కాకుండా.. వృత్తి పరమైన మెడికల్ కోర్సులు విద్యను అభ్యసించాలని తమిళి సై సూచించారు. కాగా గవర్నర్ పర్యటన దృష్ట్యా జిల్లాలో పోలీసులు ముందస్తుగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2022-08-25T17:40:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising