ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయాలపై అధికారుల అజమాయిషీ ఎందుకు..

ABN, First Publish Date - 2022-01-22T05:22:23+05:30

ఆలయాలపై అధికారుల అజమాయిషీ ఎందుకు..

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న గోవిందానంద సరస్వతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్‌టౌన్‌,  జనవరి 21: సుప్రీంకోర్టు తీర్పు ఉత్తర్వుల మేరకు హిందూ దేవాలయాలపై ప్రభుత్వ అధికారుల అజమాయిషీ అవసరం లేద ని, అది రాజ్యాంగ విరుద్దమని హంపీ పీఠాధిపతి, కాకతీయ సంస్థానాదీశులు గోవిందానంద సరస్వతి అన్నారు. శుక్రవారం నగరంలోని కాశిబుగ్గ శ్రీకాశీ విశ్వేశ్వరాలయాన్ని సందర్శించగా, ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా హిందూ దేవాలయాలను రక్షించు కోవాల్సిన బాధ్యత  హిందువులదేనన్నారు. 

మన గ్రామం, మన దేవాలయం, మన పాలన అనే అంశంతో ముందుకు సాగాలన్నారు. రాష్ట్రంలో చర్చీలు, మసీదు వంటి ప్రార్థనా మందిరాలపై ప్రభుత్వ అధికారుల అజమాయిషీలేనప్పుడు హిందు ఆలయాల్లో పెత్తనం ఏమిటని ప్రశ్నించారు.  దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం రాజ్యాంగ విరుద్ద మన్నారు. మన గ్రామం, మన దేవుడు, మన దేవాలయాన్ని మనమే పరిపా లించుకోవాలన్నారు. ఎక్కడైన దేవాలయాల్లో మిస్‌ మేనేజ్‌మెంట్‌ చేస్తే ప్రభు త్వం కల్పించుకుని దానిని చక్కదిద్ది మళ్లీ వారికే పాలన బాధ్యతలను అప్ప గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్య దర్శి గోనే జగదీశ్వర్‌, కార్యదర్శి ఓరుగంటి కొంరయ్య, ఉప కోశాధికారి బోడ కుంటి వైకుంఠం, ప్రభాకర్‌, రమేష్‌, కృష్ణమూర్తి, భాస్కర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-22T05:22:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising