ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హమాలీ కమాల్‌.. రూ.60లక్షలు!

ABN, First Publish Date - 2022-10-17T09:53:37+05:30

రూ.60 లక్షలు.. సాఫ్ట్‌వేర్‌ రంగంలో కొందరు సీనియర్లకు ఏడాదికి దక్కే జీతం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మెదక్‌ జిల్లా కొల్చారంలోని ఐఎంఎ్‌ఫఎల్‌ 
  • డిపోలో హమాలీ పోస్టుకు వేలం
  • పదేళ్ల కిందట 6 లక్షలు.. ఐదేళ్ల క్రితం 30 లక్షలు
  • ఉమ్మడి జిల్లా పోయి.. పరిధి తగ్గినా రెట్టింపు
  • రోజుకు 3 వేల దాకా కూలీ.. పైన అదనపు రాబడి
  • ఎవరైనా పని వదిలేసినా.. లేదా 
  • చనిపోయినా.. అదీ స్థానికులకే చాన్స్‌


మెదక్‌, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): రూ.60 లక్షలు.. సాఫ్ట్‌వేర్‌ రంగంలో కొందరు సీనియర్లకు ఏడాదికి దక్కే జీతం..! లేదా ప్రభుత్వ ఉన్నతోద్యోగికి సంవత్సరానికి వచ్చే వేతనం..! అదీ కాదంటే ప్రైవేటు రంగ సంస్థల్లోని డైరెక్టర్‌ స్థాయి వ్యక్తులకు లభించే మొత్తం..! కానీ, ఇంతే డబ్బును కేవలం ఓ హమాలీ పోస్టు కోసం వెచ్చించారు. రూ.60 లక్షలు నమ్మకమైన వారికి ఎవరికైనా రూపాయి వడ్డీకి ఇచ్చినా నెలకు రూ. 60 వేల చొప్పున వస్తాయి. కాలు మీద కాలు వేసుకుని.. ఒంటి మీదున్న దుస్తుల ఇస్త్రీ నలగకుండా కూర్చుని తినొచ్చు. కానీ, ‘కూలీ పని’ని పొందేందుకు పోటీ పడి మరీ అంత డబ్బును పెట్టారు. ఇంతకూ ఈ వైనం ఏమిటంటే.. మెదక్‌ జిల్లా కొల్చారం మండ లం చిన్నఘనపూర్‌ ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌ (ఐఎంఎ్‌ఫఎల్‌) డిపో ఉంది. ఇందులో హమాలీ పోస్టుకు మొదటినుంచి మంచి డిమాండ్‌. ఎవరైనా కార్మికులు పని ఇష్టం లేక వెళ్లిపోయినా.. చనిపోయినా ఈ పోస్టును వేలం వేయడం ఆనవాయితీ. దీంట్లో స్థానికులకే అవకాశం ఉంటుంది. వేలం వ్యవహారం కూడా అంతర్గతంగానే జరిగిపోతుంటుంది. ఈ నేపథ్యంలో.. డిపోలో హమాలీగా పనిచేసే చిన్నఘనపూర్‌కు చెందిన నాగం సతీష్‌ ఇటీవల మృతిచెందాడు. అతడి స్థానాన్ని మరొకరికి ఇచ్చేందుకు ఆదివారం వేలం నిర్వహించారు. 


ధర అలాఅలా పెరుగుతూ పో యింది. చివరకు గ్రామస్థుడొకరు అక్షరాలా రూ.60.10 లక్షలకు వేలం దక్కించుకున్నాడు. వాస్తవానికి 2012లో ఇదే డిపోలో హమాలీ పోస్టు వేలం రూ.6 లక్షలు పలికింది. 2017కు వచ్చేసరికి అది రూ.30లక్షల వరకు వెళ్లింది. మరోవైపు జిల్లాల విభజన అనంతరం సిద్దిపేటలో ఐఎంఎఫ్‌ఎల్‌ కొత్త డిపో ఏర్పడింది. కొల్చారం డిపో పరిధి మెదక్‌, సంగారెడ్డి జిల్లాలకే పరిమితమైంది. దీనిప్రకారం దుకాణాల సంఖ్య కూడా తగ్గింది. కానీ.. హమాలీ పోస్టుకు వేలం మొత్తం రెట్టింపు కావడం గమనార్హం. మద్యం కార్టన్లను దించి, ఎక్కించే హమాలీ పనికి రోజువారీగా రూ.2,500 నుంచి రూ.3 వేలు కూలి వస్తుంది. ఈ లెక్కన నెలకు రూ.75 వేల నుంచి రూ.90 వేల వరకు వస్తాయి. అయితే, దీనికిమించి అదనపు ఆదాయం దండిగా సమకూరుతుంది. దుకాణదారులకు వాహనాలను అద్దెకివ్వడం తదితరాలు ఇందులో ఉన్నాయి. కాగా, డిపో అధికారులకు సంబంధం లేకుండా కేవలం హ మాలీ మజ్దూర్‌ ఆధ్వర్యంలో గుట్టుచప్పుడు కా కుండా వేలం వేస్తారని స్థానికులు చెబుతున్నారు. హమాలీగా అవకాశం వచ్చినవారు.. కొంత డబ్బు అధికారులకు, మరికొంత యూనియన్‌కు ఇస్తారని తెలిసింది. 

Updated Date - 2022-10-17T09:53:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising