ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంతంగా గ్రూప్‌-1 పరీక్ష

ABN, First Publish Date - 2022-10-17T06:05:06+05:30

ప్రశాంతంగా గ్రూప్‌-1 పరీక్ష

ఏఎస్‌ఎం మహిళా కాలేజీ వద్ద చిన్నారిని ఎత్తుకున్న ఏసీపీ గిరికుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా వ్యాప్తంగా 7,374 మంది అభ్యర్థుల హాజరు

కేంద్రాల్లో పర్యటించిన అడిషనల్‌ కలెక్టర్‌ హరిసింగ్‌

పరీక్షా కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు

వరంగల్‌ కలెక్టరేట్‌, అక్టోబరు 16: జిల్లా వ్యాప్తంగా ఆదివారం గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఇందుకోసం 27 సెంటర్లు ఏర్పాటు చేశారు. 9,716 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 7,374 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. 2,342 మంది గైర్హాజరయ్యారు. గ్రూప్‌-1 పరీక్షకు మొత్తం 75.90 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. జిల్లాలోని 27 సెంటర్లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, ప్రభుత్వం 27మంది రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖకు సంబంధించిన అధికారులకు విధులు కేటాయించింది. ఏడుగురు తహసీల్దార్లను ఇన్‌చార్జీలుగా నియమించింది. వరంగల్‌ నగరంలోని ఎల్‌బీ కళాశాల, నాగార్జున హైస్కూల్‌, ఎస్‌ఆర్‌ కళాశాలల్లో ఏర్పాటు చేసిన గ్రూప్‌-1 పరీక్షా కేంద్రాలను జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ బి.హరిసింగ్‌ పర్యవేక్షించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులు పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రానికి 15 నిమిషాల ముందే అభ్యర్థులు చేరుకోవాలని, గ్రూప్‌-1 పరీక్ష నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ ప్రకారం హాజరు కావాలని అధికారులు సూచించడంతో అభ్యర్థులను పరీక్షా కేంద్రాలకు అనుమతించారు.

పరీక్షకు నెల రోజుల చిన్నారితో అభ్యర్థిని..

గ్రూప్‌-1 పరీక్ష రాయడానికి ఓ అభ్యర్థిని తన నెల రోజుల చిన్నారిని ఎత్తుకుని కేంద్రానికి వచ్చింది. ఖిలా వరంగల్‌ రోడ్డులోని ఏఎస్‌ఎం కళాశాలలో సెంటర్‌ ఏర్పాటు చేయగా పరీక్ష రాయడానికి తన బిడ్డతో వచ్చింది. అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న వరంగల్‌ ఏసీపీ కలకోట గిరికుమార్‌ చిన్నారిని తన చెంతకు తీసుకొని ఆ మహిళను పరీక్ష రాయడానికి అనుమతించారు. నెల రోజుల పసికందును ఏసీపీ, ఇతర పోలీసు అధికారులు పరీక్ష పూర్తయ్యేంత వరకు లాలించారు.

Updated Date - 2022-10-17T06:05:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising