ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజకీయ ప్రయోజనాల కోసమే ‘ధాన్యం’ ఆందోళనలు: చాడ

ABN, First Publish Date - 2022-04-10T01:12:57+05:30

రాష్ట్రంలో ప్రస్తుతం ధాన్యం కొనుగోలుకు సంబంధించి జరుగుతున్న ఆందోళనలు రైతుల ప్రయోజనాల కోసం కాకుండా రాజకీయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంస్థాన్‌నారాయణపురం: రాష్ట్రంలో ప్రస్తుతం ధాన్యం కొనుగోలుకు సంబంధించి జరుగుతున్న ఆందోళనలు రైతుల ప్రయోజనాల కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తన స్పష్టమైన వెఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్‌ఎస్‌, బీజేపీలు రాజకీయ ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నాయని దుయ్యబట్టారు. మోదీ అధికారంలోకి వచ్చాక లాభాల బాటలో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేస్తున్నారని విమర్శించారు. పేదలపై పన్నుల భారం మోపుతూ పెట్టుబడిదారులకు రాయితీలు కల్పిస్తున్నారని విమర్శించారు. ధరలను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వెంకటరెడ్డి తప్పుబట్టారు.

Updated Date - 2022-04-10T01:12:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising