ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని వచ్చాను: గవర్నర్ తమిళి సై

ABN, First Publish Date - 2022-08-07T18:09:16+05:30

నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ (Basara IIIT) లో సరైన వసతులు లేవని, భోజనశాల నిర్వహణ బాగోలేదని విద్యార్థుల నుంచి ఫిర్యాదులందడంతో ఆదివారం ఉదయం విద్యా సంస్థను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ (Basara IIIT) లో సరైన వసతులు లేవని, భోజనశాల నిర్వహణ బాగోలేదని విద్యార్థుల నుంచి ఫిర్యాదులందడంతో ఆదివారం ఉదయం విద్యా సంస్థను సందర్శించారు. బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో కలియతిరిగారు. విద్యా బోధన, వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. హాస్టల్ గదులు, వాష్‌రూంలను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు. అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. 


అనంతరం మీడియాతో గవర్నర్ తమిళి  సై (Gorernor Tamilisai) ఇలా మాట్లాడారు..

‘‘నేను ఒక తల్లిగా ఇక్కడికి వచ్చాను. విద్యార్థుల సమస్యలను  పరిష్కరించాలని వచ్చాను. ఆహారం విషయంలో విద్యార్థులు అసంతృప్తితో ఉన్నారు.  ట్రిపుల్ ఐటీలో పరిస్థితులు అందరికీ తెలిసినవే. సానుకూల దృక్పథంతో  సమస్యలను  పరిష్కరించాలని అధికారులకు సూచించాను. సెక్యూరిటీ సమస్యలతో అందరూ ఇబ్బందులు పడుతున్నారు. అధ్యాపకుల భర్తీ‌తో సహా టైమ్ బౌండ్ ప్రకారం సమస్యలను  పరిష్కరించాలి. విద్యార్థులకు విలువలతో కూడిన విద్య, స్నేహ పూర్వక వాతావరణం కల్పించాలి’’ అని ఆదేశించారు. 

Updated Date - 2022-08-07T18:09:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising